Tuesday, 19 May 2026
  • Home  
  • బాలికల భద్రతకు కిషోర్ వికాస్ బాట.. ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో పోక్సో చట్టం, పోషకాహారంపై అవగాహన సదస్సు..
- అనకాపల్లి

బాలికల భద్రతకు కిషోర్ వికాస్ బాట.. ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో పోక్సో చట్టం, పోషకాహారంపై అవగాహన సదస్సు..

అనకాపల్లి జిల్లా, మే 19 పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎలమంచిలి మండలం ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర్ బాలికల కోసం నిర్వహించిన “కిషోర్ వికాస్” అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన బాలికలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బాలికలకు POCSO Act చట్టంపై సమగ్ర అవగాహన కల్పిస్తూ, బాలికల భద్రత, హక్కులు, అప్రమత్తతపై విలువైన సూచనలు అందించారు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య సిబ్బంది వివరించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. కృష్ణవేణి, ఏఎన్‌ఎం ఎం. లక్ష్మి, ఆశా వర్కర్ ఎ. సర్వలక్ష్మి పాల్గొని బాలికలకు ఆరోగ్య, భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు డి. రాజేశ్వరి, ఎస్.ఎస్. కాంతం, జి. సత్యవతి కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేశారు. బాలికల వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య పరిరక్షణ, భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

అనకాపల్లి జిల్లా, మే 19
పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక అంగన్‌వాడీ కేంద్రంలో కిషోర్ బాలికల కోసం నిర్వహించిన “కిషోర్ వికాస్” అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన బాలికలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా బాలికలకు POCSO Act చట్టంపై సమగ్ర అవగాహన కల్పిస్తూ, బాలికల భద్రత, హక్కులు, అప్రమత్తతపై విలువైన సూచనలు అందించారు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్య సిబ్బంది వివరించారు.
కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. కృష్ణవేణి, ఏఎన్‌ఎం ఎం. లక్ష్మి, ఆశా వర్కర్ ఎ. సర్వలక్ష్మి పాల్గొని బాలికలకు ఆరోగ్య, భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు డి. రాజేశ్వరి, ఎస్.ఎస్. కాంతం, జి. సత్యవతి కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతం చేశారు. బాలికల వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య పరిరక్షణ, భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.