ముంబైలో శుక్రవారం
కార్పొరేట్ లాస్ (సవరణ) బిల్లు–2026పై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC) సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు, జేపీసీ సభ్యులు డాll శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారు భారత రాజకీయాల్లో విశిష్ట నాయకుడు, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు *శ్రీ శరద్ పవార్ గారిని* ఆయన కుమార్తె, రాజ్య సభ సభ్యురాలు, జేపీసీ సభ్యురాలు శ్రీమతి సుప్రియా సూలే గారితోవెళ్ళి ఆత్మీయంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా డాll శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ శ్రీ శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితిని ఆప్యాయంగా అడిగి తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేశంలో కార్పొరేట్ చట్టాల సంస్కరణలు, పారదర్శకత, పెట్టుబడుల ప్రోత్సాహం, సులభతర వ్యాపార వాతావరణం, పార్లమెంటరీ వ్యవహారాలు తదితర అంశాలపై పరస్పరం స్నేహపూర్వకంగా చర్చించారు



