‘
ఎన్.కే స్టార్ క్రియేషన్స్ అధినేత మద్దిబోయిన శేషు యాదవ్ నిర్మించిన “ఏం పిల్లడో ఎలా గున్నవో” పాట ఇటీవల విడుదలై యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందుతూ హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా పాట విజయవంతమైనందుకు బారాషహీద్ దర్గాలో షంషుద్దీన్ గారు, జనార్ధన్ శివలంకి గారి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మద్దిబోయిన శేషు యాదవ్ గారిని అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన చిత్రాలు, పాటలు నిర్మించాలని ఆకాంక్షించారు.
ఈ పాటకు ఎన్.ఆర్. చైతన్య కుమార్ సంగీతం అందించగా, కళ్యాణ్ రామ్ కొరియోగ్రఫీ చేశారు. హరీష్ పటేల్ డి.ఓ.పిగా వ్యవహరించగా, నిర్మాతగా మద్దిబోయిన శేషు యాదవ్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌సీఏ ఉపాధ్యక్షులు ఎన్. సుధాకర్ రెడ్డి, ఒలేటి సత్య, రుద్రకోట వెంకటేశ్వర్లు, మీరాకిల్ మీరా, కిరణ్ శ్రీనివాసులు, ఎస్.కే. రషీద్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


