⛔రైతుల కోసం సుమారు 40 స్టాల్స్ ఏర్పాటు!
⛔కిసాన్ మేళాలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.
పున్నమి న్యూస్ నాయుడుపేట
తిరుపతి జిల్లా నాయుడుపేటలో
అగ్రి ఎక్స్‌పో & కిసాన్ మేళా కార్యక్రమం జరిగింది. రైతుల కోసం సుమారు 40 స్టాల్స్ ఏర్పాటు చేశారు.
కిసాన్ మేళాలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
సాంకేతికతతో వ్యవసాయాన్ని పండుగ చేయడమే చంద్రబాబు లక్ష్యం అని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు.
నాయుడుపేట పట్టణంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘అగ్రి ఎక్స్‌పో మరియు కిసాన్ మేళా – 2026’ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతుల అవగాహన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుమారు 40 కి పైగా వ్యవసాయ స్టాల్స్‌ను ఎమ్మెల్యే డా. విజయశ్రీ, జిల్లా కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శనలో ఉంచిన ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, డ్రోన్ల వినియోగం, నూతన యంత్రాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మరియు విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రోన్ టెక్నాలజీ ప్రదర్శన రైతులను విశేషంగా ఆకట్టుకుంది.
అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో, వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ అని నిరూపించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం అరకొరగా రూ.13,500 ఇస్తే, మన ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ. 20,000 అందిస్తూ రైతులకు అండగా నిలుస్తోంది. రాత్రి వేళల్లో రైతుల కష్టాలు తీర్చేందుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు, సాగునీటి కోసం కొత్తగా లక్షకు పైగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం,” అని వివరించారు.
అలాగే, రైతులపై పెట్టుబడి భారం పడకుండా ఆధునిక డ్రోన్లపై 80-90 శాతం భారీ సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తోందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. రైతులు ఈ నూతన సాంకేతికతలను అందిపుచ్చుకుని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతు సోదరులు పాల్గొన్నారు.


