కాకినాడ జిల్లా తాళ్ళరేవు గ్రామపంచాయతీ పరిధిలోని మాధవరాయునిపేట గ్రామంలో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి,ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అనుమానాలు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు,కండోమ్ వాడకం, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు.ఈ సందర్భంగా ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి తదితరులు పాల్గొన్నారు.

బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై అవగాహన
కాకినాడ జిల్లా తాళ్ళరేవు గ్రామపంచాయతీ పరిధిలోని మాధవరాయునిపేట గ్రామంలో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సూచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దిశా,బీమాభాయి మహిళా మండలి సహకారంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అంశాలపై మరియు హెచ్ ఐ వి,ఎయిడ్స్ మరియు లైంగిక వ్యాధులపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు,హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పట్ల గల అనుమానాలు, హెచ్‌ఐవీ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు,కండోమ్ వాడకం, హెచ్‌ఐవీ సోకిన వారికి అందుబాటులో ఉన్న చికిత్సా సేవలు, క్షయ వ్యాధి, డ్రగ్స్ వినియోగం, హెచ్‌ఐవీ బాధితుల పట్ల వివక్షత చూపకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్‌కు సంబంధించిన ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే 1097 టోల్‌ఫ్రీ నంబర్, హెచ్‌ఐవీ మరియు ఎయిడ్స్ చట్టం 2017, ఏఆర్‌టీ మందుల కేంద్రాలు తదితర అంశాలపై వివరించారు.ఈ సందర్భంగా ఐఈసీ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి తదితరులు పాల్గొన్నారు.

