Wednesday, 2 September 2026
  • Home  
  • జి కొండూరు మండలం ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

జి కొండూరు మండలం ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యే పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

పల్లె ప్రజల ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. జి.కొండూరు, చెవుటూరులో రూ.72 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాలు ప్రారంభం. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు సెప్టెంబర్ 2: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పల్లె ప్రజల ఆరోగ్య నిలయాలుగా నిలవనున్నాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు. జి.కొండూరు, చెవుటూరు గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఒక్కో ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.72 లక్షల నిధులను వెచ్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ముఖ్యమన్నారు. నూతనంగా నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా జి.కొండూరు, చెవుటూరు గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా వైద్య సేవలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సలహాలు తదితర సేవలు స్థానికంగానే పొందే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు. ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్య సేవలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నార

పల్లె ప్రజల ఆరోగ్య నిలయాలుగా గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

జి.కొండూరు, చెవుటూరులో రూ.72 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్ర భవనాలు ప్రారంభం.

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు సెప్టెంబర్ 2:

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు పల్లె ప్రజల ఆరోగ్య నిలయాలుగా నిలవనున్నాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు అన్నారు.

జి.కొండూరు, చెవుటూరు గ్రామాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాలను ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఒక్కో ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.72 లక్షల నిధులను వెచ్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం ఎంతో ముఖ్యమన్నారు. నూతనంగా నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాల ద్వారా జి.కొండూరు, చెవుటూరు గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు కూడా వైద్య సేవలు మరింత సులభంగా అందనున్నాయని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమిక వైద్యం, ఆరోగ్య పరీక్షలు, వైద్యుల సలహాలు తదితర సేవలు స్థానికంగానే పొందే అవకాశం కలుగుతుందన్నారు.

ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు. ప్రజలు ఈ ఆరోగ్య కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైనప్పుడు వైద్య సేవలు పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నార

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.