బైక్ ర్యాలీ, వర్చువల్ కార్యక్రమం, రక్తదానంతో ఘనంగా వేడుకలు
ఆత్మకూరు, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి): జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు నియోజకవర్గంలో బుధవారం జనసేన శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఆత్మకూరు పట్టణంలోని సత్రం సెంటర్ నుంచి ఎల్.ఆర్.పల్లి, నెల్లూరు పాలెం మీదుగా శ్రీధర్ గార్డెన్స్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ డప్పులు, బాణాసంచా సందడితో జనసైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం శ్రీధర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.మధ్యాహ్న భోజనాల అనంతరం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకారంతో జనసైనికులు రక్తదానం చేసి సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని భూ సమస్యలు, నడికుడి–శ్రీకాళహస్తి రైల్వే మార్గం, ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాంత అభివృద్ధి అంశాలపై పార్టీ శ్రేణులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


