డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి గన్నవరం నియోజకవర్గం
జనసేనాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా… అంబాజీపేట మహిళా జూనియర్ కళాశాలలో 38 మంది విద్యార్థినులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.
అంబాజీపేట జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొర్లపాటి రాజగోపాల్ (గోపి) సమకూర్చిన యూనిఫామ్స్‌ను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విద్యార్థినులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సహృదయంతో దాతలు అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, విద్యాసంస్థల మరింత అభివృద్ధికి దాతల సహకారం కూడా ఎంతో అవసరమని అన్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా ఇంటర్మీడియట్ విద్యార్థులకు యూనిఫామ్స్ అందిస్తున్న కొర్లపాటి గోపీ సేవలను ఎమ్మెల్యే అభినందించారు.



