నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం బుధరావుపేట గ్రామంలోవైఎస్సార్ 17 వర్ధంతి సందర్భంగా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్, గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు నాయకులు పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
గ్రామ సర్పంచ్ పెసరు రాణి గోవర్ధన్. పార్టీ అధ్యక్షులు లింగిడి వెంకటేశ్వర్లు. రాష్ట్ర యూత్ జాయింట్ సెక్రటరీ ఎల్లా గౌడ్. ఉపేందర్ .లాల్ సాబ్ .ఎస్ కే షరీఫ్ . చెడిపాకయాకయ్య .కోడి మల్లేష్. సీనియర్ నాయకులు. మారగాని లింగయ్య .గుండు సాంబయ్య. ఆకుల రామచంద్రు. కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.



