Saturday, 30 May 2026
  • Home  
  • ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిక
- News

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండొచ్చని ఐఎండీ హెచ్చరిక

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతమే ఉండే అవకాశముందని తెలిపింది. గతంలో అంచనా వేసిన 92 శాతం నుంచి ఈ అంచనాను తగ్గించింది. కేరళలో రుతుపవనాల ప్రవేశం కూడా ఆలస్యమయ్యే అవకాశముందని, జూన్ తొలి వారంలోనే అవి చేరే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటలు, భూగర్భ జలాలు, తాగునీటి వనరులపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాల సగటులో 90 శాతమే ఉండే అవకాశముందని తెలిపింది. గతంలో అంచనా వేసిన 92 శాతం నుంచి ఈ అంచనాను తగ్గించింది.

కేరళలో రుతుపవనాల ప్రవేశం కూడా ఆలస్యమయ్యే అవకాశముందని, జూన్ తొలి వారంలోనే అవి చేరే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటలు, భూగర్భ జలాలు, తాగునీటి వనరులపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.