మహారాష్ట్రలోని పుణే, పింప్రి-చించ్వాడ్ ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మరో పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముంబై నుంచి అక్రమంగా తెచ్చిన ఇథనాల్‌ను ఉపయోగించి మద్యం తయారు చేసి విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక ప్రజలు, ప్రతిపక్ష నేతలు పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శించారు.


