చంద్రగిరి సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి
చంద్రగిరి మండలం శానంబట్ల గ్రామంలో బుధవారం జరిగిన మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ ముడుపల్లి సురేష్ రెడ్డి తండ్రి దివంగత ముడుపల్లి రామ కృష్ణారెడ్డి దశ దిన కర్మ క్రియలకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా రామక్రిష్ణారెడ్డి చిత్ర పటానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం సురేష్ రెడ్డితో పాటు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.



