ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, విద్యుత్ శాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. వేడుకలకు వచ్చిన చిన్నారులకు అధికారులు, సిబ్బంది చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పిల్లలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. కార్యాలయ ప్రాంగణాలను త్రివర్ణ పతాకాలు, పూలతో అలంకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

మనుబోలులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, విద్యుత్ శాఖ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. వేడుకలకు వచ్చిన చిన్నారులకు అధికారులు, సిబ్బంది చాక్లెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. పిల్లలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. కార్యాలయ ప్రాంగణాలను త్రివర్ణ పతాకాలు, పూలతో అలంకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య కొనసాగాయి.

