ఆత్మకూరు ఎంవీఐ రాములుకు ఉత్తమ సేవా అవార్డు
ఆత్మకూరు: విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) రాములుకు ప్రతిష్టాత్మక ఉత్తమ సేవా అవార్డు లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా రాములు ఈ అవార్డును అందుకున్నారు.విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు రవాణా శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ప్రజా భద్రత, రవాణా నిబంధనల అమలు, శాఖాపరమైన విధుల్లో చూపిన చొరవను అధికారులు గుర్తించి ఈ అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా ఎంవీఐ రాములును రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు అభినందించారు. ఉత్తమ సేవా అవార్డు అందుకోవడం పట్ల ఆత్మకూరు ప్రాంతానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.


