Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరు పట్టణానికి మంత్రి ఆనం మరో అభివృద్ధి కానుక!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు పట్టణానికి మంత్రి ఆనం మరో అభివృద్ధి కానుక!

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, నవంబర్ 26 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణ ప్రజలకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరో అభివృద్ధి కానుకను అందించారు.
  • ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వినియోగదారులకు కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోలులో మరింత సౌకర్యం కల్పించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ వసతులు అందించాలనే లక్ష్యంతో నూతన రైతు బజార్ నిర్మాణానికి రూ.48 లక్షల 50 వేల నిధులు మంజూరయ్యాయి.ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ…
  • ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె.

రూ.48.50 లక్షలతో నూతన రైతు బజార్ నిర్మాణానికి నిధులు మంజూరుమహిళలు, వినియోగదారులకు మెరుగైన వసతులు.. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు

ఆత్మకూరు, నవంబర్ 26 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు పట్టణ ప్రజలకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరో అభివృద్ధి కానుకను అందించారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వినియోగదారులకు కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోలులో మరింత సౌకర్యం కల్పించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ వసతులు అందించాలనే లక్ష్యంతో నూతన రైతు బజార్ నిర్మాణానికి రూ.48 లక్షల 50 వేల నిధులు మంజూరయ్యాయి.ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ప్రాంగణంలో ఈ రైతు బజార్‌ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, ఐఏఎస్, ఈ నెల 18వ తేదీన పరిపాలనా, బడ్జెట్ అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.నూతన రైతు బజార్ నిర్మాణం పూర్తయితే స్థానిక రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు అవకాశం కలగనుంది. పట్టణ ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి రావడంతో పాటు మహిళలు, కుటుంబాలకు కొనుగోళ్లలో మరింత సౌలభ్యం కలగనుంది.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు పట్టణంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు మరో ముందడుగు పడింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *