Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

28 న మహా రుద్రాభిషేకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
28 న మహా రుద్రాభిషేకం

వార్త ముఖ్యాంశాలు

  • -వేదిక : త్యాగరాజ కల్యాణమండపం -అందరూ ఆహ్వానితులే -ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ కార్తీకమాస సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 28 వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి నెల్లూరు బాలాజీనగర్ లో గల త్యాగరాజ కల్యాణమండపం నందు సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యం లో…

-వేదిక : త్యాగరాజ కల్యాణమండపం
-అందరూ ఆహ్వానితులే
-ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్
కార్తీకమాస సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 28 వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుంచి నెల్లూరు బాలాజీనగర్ లో గల త్యాగరాజ కల్యాణమండపం నందు సింహపురి ధార్మిక సంస్థ ఆధ్వర్యం లో మహా రుద్రాభిషేకం ,పుష్పాభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని ఈ కార్యక్రమాలకు అందరు ఆహ్వానితులేనని ఆ ధార్మిక సంస్థ వ్యవస్థాపకులు 22 వ డివిజన్ కార్పోరేటర్ ఉచ్చి భువనేశ్వరీ ప్రసాద్ గురువారం తెలిపారు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి దంపతుల సౌజన్యంత్తో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు కార్తీకమాసంలో ఈ రుద్రాభిషేక కార్యక్రమం లో పాల్గొనడం ద్వారా విశేషమైన ఫలితాలు లభిస్తాయన్నారు 101 రుద్ర సూక్త పారాయణలతో ఈశ్వరుని అభిషేకించేదే ఈ కార్యక్రమం అన్నారు దీనితో పాటు పుట్ట మట్టితో చేసిన 365 మృత్తికా లింగాలకు కూడా అభిషేక అర్చనలు జరుగుతాయన్నారు ఈ మృత్తికా లింగార్చన చేసినా ,చూసినా సంవత్సరం అంతా శివుని అభిషేకించిన ఫలితం లభిస్తుందన్నారు ఈ కార్యక్రమానికి కుర్తాళం సిద్దేశ్వర పీఠ ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మాచవోలు రమేష్ శర్మ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారన్నారు వారి ప్రధాన ఋత్విక్వన అభిషేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు కావున ఎల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ గోత్ర నామాలతో సంకల్పాలు చెప్పించుకొని భవాని శంకరుల అనుగ్రహానికి పాత్రులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు శ్రీశైల క్షేత్ర లడ్డు ప్రసాద వితరణ కూడా జరుగుతుందన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *