జిల్లాలోని బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలను ఆర్థికంగా స్వావలంబన కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న బీసీ మహిళలు అర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల్లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు, నిరాశ్రయులు, MERA/MERU కమ్యూనిటీ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అర్హులు సెప్టెంబర్ 13లోగా tgobmms.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.



