Saturday, 27 June 2026
  • Home  
  • నారా లోకేష్ భారీ క్యాడర్ మీటింగ్-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

నారా లోకేష్ భారీ క్యాడర్ మీటింగ్-ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నిర్వహించబోయే భారీ ‘క్యాడర్ మీటింగ్’ ఏర్పాట్లపై శనివారం ఊరందూరులోని నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు, కూటమి ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు కూటమి శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన చర్యలపై నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నాయకులు, అధికారుల బృందంతో కలిసి ఏర్పేడులో ఏర్పాటు చేస్తున్న భారీ సభా ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా స్థలి వద్ద జరుగుతున్న పనుల ప్రగతిని అడిగి తెలుసుకుని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను, కమిటీ సభ్యులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేయబోతున్న లోకేష్ పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.