ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన పీపీపీ-2026 (PPP-2026) విధానం ద్వారా ప్రభుత్వ ఆస్తులను, సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి దోచుకోవడానికి చూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఇది రాష్ట్రాన్ని అమ్మేసే కుట్ర అని ఆయన ధ్వజం చేశారు.
*కన్నబాబు ముఖ్య ఆరోపణలు,డిమాండ్లు* ప్రజా ఆస్తుల దోపిడీ: తాగునీరు, శానిటేషన్, రోడ్లు, హౌసింగ్, మార్కెట్లు, పార్కులు వంటి ముఖ్యమైన సేవలను ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని కన్నబాబు పేర్కొన్నారు.
వివరాలు బయట పెట్టాలి: పీపీపీ ప్రాజెక్టులకు కేటాయించిన భూములు, వాటి మార్కెట్ విలువ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రభుత్వ వాటా, పన్ను మినహాయింపులు వంటి పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
విధానం ఉపసంహరించుకోవాలి: ఈ పీపీపీ-2026 పాలసీని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేదా దీనిపై బహిరంగ చర్చ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

