“అర్నబ్” తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, దిగువన ఉన్న తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అవంతి నగర్ కాలనీ ముంపునకు గురికాకుండా కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
“అర్నబ్” తుఫాను కారణంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని పేట కాలువలోని నీరు కిందకు దిగకపోవడంతో, దిగువన ఉన్న తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని అవంతి నగర్ కాలనీ ముంపునకు గురికాకుండా కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు క్షేత్రస్థాయిలో పర్యటించి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి, పెనువెంటనే జేసీబీలతో పనులను ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని నీటి సంఘం ప్రెసిడెంట్లు మరియు సొసైటీ సభ్యులు కూడా తక్షణమే తమ పరిధిలోని కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. స్థానిక నాయకులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉంటూ ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌డీవో (DLDO) శ్రీ వాసుదేవరావు, ఎంపీడీవో (MPDO) శ్రీ పి. సతీష్, ఇవోపీఆర్డి (EOPRD) శ్రీ రామాంజనేయులు, కూటమి నాయకులు శ్రీ బుర్ర అను బాబు, శ్రీ తాటికాయల వీరబాబు (బుజ్జి), శ్రీ మదారపు తాతాజీ, శ్రీ మేక లక్ష్మణ్ మూర్తి, శ్రీ కర్రి వెంకట్రాజు, శ్రీ కుడుపూడి బాలాజీ, శ్రీ బత్తుల దొరబాబు, శ్రీ రామిశెట్టి సునీల్, శ్రీ తోటకూర సతీష్, శ్రీ తురగ సంతోష్, శ్రీ కాళ్ళ శ్రీనివాస్, శ్రీ గిడుతూరి శ్రీనివాస్, శ్రీ రాయుడు అనిల్, శ్రీ పంపన మహేష్, శ్రీ పాలిక వాసు, శ్రీ ముద్దుర్తి రోహిత్ కుమార్, శ్రీ పాలిక అరవింద్, శ్రీ చంటి రెడ్డి, శ్రీ చోడిశెట్టి ఇంద్ర, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.











