గంజాయి సమాచారం ఇచ్చి బహుమతి గెలుచుకోండి!
గంజాయి సమాచారం ఇచ్చి బహుమతి గెలుచుకోండి.. అంటున్న కాకినాడ జిల్లా పోలీసులు “రైజ్ ఎగైనెస్ట్ గంజా” పేరుతో భారీ అవగాహన సదస్సు నిర్వహించిన కాకినాడ జిల్లా పోలీస్ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు “రైజ్ ఎగైనెస్ట్ గంజా” పేరుతో విద్యార్థులు, యువత మరియు ప్రజలకు గంజాయికి వ్యతిరేకంగా విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, గంజాయి వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థకు, సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతో పాటు విద్యార్థులు, యువత మరియు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం “రైజ్ ఎగైనెస్ట్ గంజా” పోస్టర్ ను ఎస్పీ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. “సమాచారం ఇవ్వండి – సమాజాన్ని కాపాడండి”, “గంజాయి రహిత సమాజం – మనందరి బాధ్యత” అనే నినాదాలతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయికి సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, విలువైన సమాచారాన్ని అందించిన వారికి తగిన బహుమతి కూడా అందజేస్తామని జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారు తెలిపారు. గంజాయి సమాచారాన్ని ఇలా అందించండి: 📞 1972 – గంజాయి సమాచారం కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ 📞 112 – అత్యవసర పోలీసు సేవలు 📱 కాకినాడ పోలీస్ వాట్సాప్ నంబర్: 9494933233











