కాకినాడ రూరల్ మండల పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల పాలనా కాలం ముగుస్తున్న సందర్భంగా స్థానిక ఎంపీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ పి.సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై ఎంపీటీసీలను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రూరల్ మండలంలో **రూ.230.74 కోట్ల** అభివృద్ధి పనులు, **రూ.404.43 కోట్ల** సంక్షేమ పథకాలు కలిపి మొత్తం **రూ.635.17 కోట్లతో** క్షేత్రస్థాయి అభివృద్ధి సాధించామన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ బందీల విరీషా, ఏఎంసీ చైర్మన్ మాసుమేను మంగ గంగయ్య, డీఎల్డీఓ వాసుదేవ్, కూటమి నేతలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.







