కలిగిరి, పున్నమి ప్రతినిధి, తేది: 18-09-2026. చిన్నారుల భవిష్యత్తు వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలపైనే ఆధారపడి ఉంటుందని, అందుకే వారికి పోషకాహారం అందించడం ఎంతో అవసరమని సీడీపీఓ సి.హెచ్. పద్మజా కుమారి పేర్కొన్నారు. కలిగిరి మండలంలోని వీర్నకొల్లు అంగన్వాడీ కేంద్రంలో 9వ రాష్ట్రీయ పోషణా మాసం కార్యక్రమం ఆమె ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా సీడీపీఓ పద్మజా కుమారి మరియు సూపర్వైజర్ ఎస్. సుజాతలు మాట్లాడుతూ… గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు తమ ఆహారంలో సరైన పోషక విలువలు ఉండేలా చూసుకోవాలని అవగాహన కల్పించారు. చిన్నపిల్లల తల్లిదండ్రులు పిల్లల ఆహారపు అలవాట్లతో పాటు వారి ఆరోగ్యం, సమయపాలనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు శారీరక శ్రమ కలిగి ఉంటూ, తమ పనులు తాము చేసుకుంటే సుఖ ప్రసవం జరిగి, తల్లి-బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని దిశా నిర్దేశం చేశారు.ఈ అవగాహన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ ఎస్. రేణుక, బి. మాధవి కుమారి, ఎం. నవమ్మ, ఏ.ఎన్.ఎం. అరుణ, ఎం.ఎల్. హెచ్.పి. రబ్బానీలతో పాటు గ్రామ ప్రజలు, బాలింతలు, గర్భిణీలు మరియు చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పోషకాహారంతోనే చిన్నారుల ఆరోగ్యం: సీడీపీఓ పద్మజా కుమారి