Tuesday, 29 September 2026

Tag: Kakinada

కాకినాడ

కాకినాడ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్

కాకినాడ జిల్లా తేదీ: 23-08-26 *కాకినాడ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరీంద్ర ప్రసాద్* *శనివారం ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల మధ్య మొబైల్ ఫోన్ మిస్ అయిన విషయమే జరిగిన గొడవను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన విషయం విదితమే..* *ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం కలెక్టర్ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు..* *విద్యార్థులు తమకు ఏ సమస్య లేదని సురక్షితంగా ఉన్నామని కలెక్టర్‌కు తెలిపారు..* *విద్యార్థులు తమకు ఏ సమస్య ఉన్నా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.*

కాకినాడ

నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం

• కాకినాడ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సద్దుమణిగిన విద్యార్థుల మధ్య వివాదం • జిల్లా ఎస్పీ, కలెక్టర్ జోక్యంతో వివాదానికి ముగింపు • మొబైల్ ఫోన్ మిస్ అయిన అంశంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు, తెలుగు విద్యార్థుల మధ్య వివాదం • అధికారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు • తమకు సహాయంగా నిలిచిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన మణిపూర్ విద్యార్థులు Uploaded Video:

కాకినాడ

ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసిపి అండగా ఉంటుంది కక్ష సాధింపు చర్యలు ఆపి, సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి జమ్మలమడక నాగమణి

కాకినాడ.ఆగస్ట్ 22 : కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నియంతృత్వ విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని లేదా కూటమి నాయకులను ఏ విషయంలోనైనా ప్రశ్నిస్తే “రెడ్ బుక్ రాజ్యాంగం” పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని, సస్పెన్షన్లతో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగాల్లో చేరే నాటికి లేని టెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నాయకత్వాన్ని (కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన టీచర్లు) అన్యాయంగా సస్పెండ్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్న లక్షలాది మంది సీనియర్ టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే వారు చేసిన నేరమా అని సూటిగా ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఐఆర్, మెరుగైన పిఆర్సి , అమలు చేయకపోగా, పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగులకు అందాల్సిన పిఆర్సి బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ , మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్ బకాయిలు దాదాపు రూ. 35,000 కోట్ల నుండి రూ. 40,000 కోట్ల వరకు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు.ఉద్యోగుల పెన్షన్ వ్యవస్థపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా వారిని త్రిశంకు స్వర్గంలో నెట్టేశారని ధ్వజమెత్తారు.తమ న్యాయమైన హక్కులు, బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, టీచర్లపై కక్షసాధింపు చర్యలు తక్షణమే నిలిపివేయాలని, అక్రమంగా సస్పెండ్ చేసిన ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేసి, వారికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో అన్యాయానికి గురైన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా నిలిచి, వారి పోరాటానికి మద్దతుగా న్యాయపరమైన, రాజకీయ పోరాటాలు చేస్తుందని హెచ్చరించారు. ప్రశ్నించే ప్రతి గొంతుకకు వైసీపీ అండగా ఉంటుందని జమ్మలమడక నాగమణి అన్నారు.

కాకినాడ

రూరల్‌ నియోజకవర్గంలో CMRF ద్వారా రూ. 3.44 కోట్ల వైద్య సాయం:* *పేద ప్రజల ఆపద్బాంధవులు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు*

ఆరోగ్యాంధ్ర ప్రదేశే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూరల్ నియోజకవర్గంలో నేటివరకు సుమారు 353 మందికి ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబాలను ఆదుకున్నారు. కాకినాడ గుడారిగుంటలోని రూరల్ శాసన సభ్యుల వారి కార్యాలయం నందు ముఖ్య మంత్రి సహాయనిధి (CMRF) ద్వారా 18 (పద్దెనిమిది) మందికి రియంబర్స్మెంట్ మరియు 2 (ఇద్దరికీ) LOCలతో కలిపి మొత్తం 20 మందికి మంజూరు అయిన 19,35,426/- రూపాయలు విలువ గల చెక్కులను లబ్ధిదారులకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు శ్రీ పంతం సందీప్ గారు కూటమి నాయకులు చిక్కాల రామచంద్ర రావు గారు, డా. చప్పిడి వెంకటేశ్వర రావు గారు, పితాని లీల గారు, బోళ్ళ కృష్ణ మోహన్ గారు, వల్లూరి రాజా గారు, నల్లే ప్రసన్న కుమార్ గారు, మట్టపర్తి ప్రకాష్ గౌడ్ గారు, నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, కరెడ్ల గోవింద్ గారు, బండారు మురళి గారు, తిరుమాని కుమార స్వామి గార్లతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుండి సీఎంఓ కార్యాలయానికి 500 అప్లికేషన్స్ పంపించగా ఈనాటికి సుమారు 353 మందికి 3,44,08,099/-రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించామన్నారు. ఇంకా మిగిలిన 147 అప్లికేషన్స్ పరిశీలనలో ఉన్నాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నల్లం శ్రీరాములు గారు, అద్దంకి వీరబాబు గారు, ర్యాలీ సతీష్ గారు, తాటికాయల వీరబాబు గారు, పుల్ల శ్రీరాములు గారు, పుల్ల వీరబాబు గారు, సోదే ముసలయ్య గారు, పితాని గన శివ తేజ గారు, గరికిన సురేష్ గారు, వానపల్లి వెంకట రమణ గారు, గరగ శ్రీనివాస్ గారు, గంటా నాని బాబు గారు, రామిశెట్టి సునీల్ గారు, తోటకూర సతీష్ గారు, చోల్లు ఇమ్మాన్యుయేల్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, వాసంశెట్టి త్రిమూర్తులు గారు, వాసంశెట్టి వెంకటేశ్వర రావు గారు, లావణ్య గారు, డి స్వాతి గారు, సుందర సత్తిబాబు గారు, గంజా వర ప్రసాద్ గారు, మారెళ్ల శివ గారు, యలమంచిలి భాస్కర రావు గారు, కనపర్తి చిన్న గారు, శాండీ గారు, గరగ రామ్ గారు, పుప్పాల గోవిందరాజులు గారు, చోడిశెట్టి గంగాధర్ గారు, యర్రంనీడి ప్రసాద్ గారు, పబ్బినీడి ప్రదీప్ గారు, దౌలూరి సత్యనారాయణ గారు, గుమ్మెళ్ల సుబ్రహ్మణ్యం గారు, ఆచంట వీరబాబు గారు, కూటమి శ్రేణులు మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ పరిధిలో గల రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ (SD & T Department) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన – 22 సంస్థలు హాజరు

రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్, కాకినాడలో మెగా జాబ్ మేళాకు భారీ స్పందన – 22 సంస్థలు హాజరు* కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఆగష్టు 20: స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాకు నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు. కళాశాల ప్రిన్సిపాల్ రవికాంత్ గారు నిరుద్యోగులను ఉద్దేశించి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పంతం సందీప్ గారు జాబ్ మేళా ప్రారంభించి మాట్లాడుతూ, “కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని నియోజకవర్గంలోని యువత ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అయిన శ్రీ ఎస్. గోపికృష్ణ గారు మాట్లాడుతూ ఈరోజు నేను మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే దానికి కొన్ని సంవత్సరాల నా కృషి కారణం అని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధి అధికారి అయిన శ్రీ జి. శ్రీనివాస్ గారు ప్రతి ఒక్కరు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని, అంచెలంచెలుగా ఎదగాలని, తాను కొన్ని సంవత్సరాలపాటు వివిధ స్థాయిలలో పనిచేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఈ స్థాయికి వచ్చాను” అన్నారు. *ముఖ్యాంశాలు:* – ఈ జాబ్ మేళాకు *22 సంస్థలు* హాజరై యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఉపాధి అధికారి శ్రీ జి.శ్రీనివాస్ గారు, కాకినాడ జిల్లా నైపుణ్య అధికారి శ్రీ ఎస్. గోపి కృష్ణ గారు, కళాశాల ప్రిన్సిపాల్ రవికాంత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్ధ యొక్క ఉద్యోగులు మరియు అధిక సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాకి 321 మంది హాజరు కాగా 52 మంది ఎంపిక అయ్యారు, అలాగే 40 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. Uploaded Video:

కాకినాడ

* అభివృద్ధి చేస్తున్న పండూరు చెరువు సుందరీకరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు..*

కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామం (కాకినాడ – పిఠాపురం రోడ్డు)న ఉన్న పండూరు చెరువును 2 కోట్ల పైచిలుకు వ్యయంతో చేపట్టిన సుందరీకరణ, ఆధునీకరణ పనులను ఈరోజు కాకినాడ రూరల్ గౌరవ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారు సంబంధిత అధికారులు, కూటమి నాయకులతో కలసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు గారు, వెలిశెట్టి రాజేష్ గారు, శాండీ గారు, నయీం గారు, తుమ్మలపల్లి వాసు గారు, సంబంధిత శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

కాకినాడ లో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

కాకినాడ: స్వాతంత్ర్యం కోసం ఒక తరం పోరాటం చేస్తే, మరో తరం దానిని కాపాడిందని, దేశ నిర్మాణానికి పునాదులు వేయాల్సిన బాధ్యత ప్రస్తుతం తరంపై ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తూ.. “వేగం అనేది సత్యం కాదు” (Speed is not truth) అని, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు అందులో వాస్తవం ఉందా లేదా అని ఆలోచించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను ఇతరులను దూషించడానికి కాకుండా, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. వ్యవస్థల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దాలే తప్ప, ఆస్తులను ధ్వంసం చేయడం మాత్రం మార్గం కాదని తన ఉద్యమ ప్రయాణాన్ని గుర్తు చేశారు. యువత దుబ్బుకు ఓటు వేయకుండా, సమస్యలకు పరిష్కారం చూపే శక్తిగా ఎదిగి భారతదేశాన్ని నడిపించాలని ఆయన ఆకాంక్షించారు.

కాకినాడ

*ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కాకినాడ*

*ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ కాకినాడ* ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ మరియు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి జంక్షన్ వరకు నిర్వహించిన ఈ అవగాహన ర్యాలీని కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్, IPS గారు మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. అనిత గారు జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారు మాట్లాడుతూ: అవయవ దానం ద్వారా మరొకరికి పునర్జన్మను ప్రసాదించే గొప్ప అవకాశం లభిస్తుందని అన్నారు. సమాజంలో ఆర్గాన్ డొనేషన్‌పై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, యువత ఈ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కుడా చైర్మన్ శ్రీ సత్య తలాటం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అవయవ దానం ఒక మహోన్నతమైన సేవ అని, మనం మరణానంతరం కూడా మరొకరి జీవితాన్ని కాపాడే అవకాశం అవయవ దానం ద్వారా లభిస్తుందని అన్నారు. ప్రజలు ఆర్గాన్ డొనేషన్‌పై ఉన్న అపోహలను తొలగించుకొని, అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతలో అవయవ దానంపై మరింత అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ చేపట్టిన అవగాహన ర్యాలీ, ఫ్లాష్ మాబ్ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డా. కల్యాణ్ బాబు, నెఫ్రాలజిస్ట్ డా. రాజా అమరేంద్ర, అనస్థీషియా విభాగం డా. కిషోర్ బాబు మాట్లాడుతూ, ఆర్గాన్ డొనేషన్ ప్రాముఖ్యత, అవయవ దానం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసే అవకాశం, ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం గురించి వివరించారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ శ్రీ నందికోళ్ల ఆంజనేయస్వామి (అంజిబాబు) మాట్లాడుతూ, అవయవ దానం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, ఆర్గాన్ డొనేషన్‌పై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక వ్యక్తి అవయవ దానం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు. ర్యాలీతో పాటు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ ద్వారా విద్యార్థులు మరియు ప్రజలకు ఆర్గాన్ డొనేషన్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది, ఆదిత్య కళాశాల విద్యార్థులు, ఆదర్శ కళాశాల విద్యార్థులు, ఇతర కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. “అవయవ దానం – మరొకరికి పునర్జన్మ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఆర్గాన్ డొనేషన్‌పై అవగాహన పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది. Uploaded Video:

కాకినాడ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన పీపీపీ-2026 (PPP-2026) విధానం ద్వారా ప్రభుత్వ ఆస్తులను, సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి దోచుకోవడానికి చూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన పీపీపీ-2026 (PPP-2026) విధానం ద్వారా ప్రభుత్వ ఆస్తులను, సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి దోచుకోవడానికి చూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఇది రాష్ట్రాన్ని అమ్మేసే కుట్ర అని ఆయన ధ్వజం చేశారు. *కన్నబాబు ముఖ్య ఆరోపణలు,డిమాండ్లు* ప్రజా ఆస్తుల దోపిడీ: తాగునీరు, శానిటేషన్, రోడ్లు, హౌసింగ్, మార్కెట్లు, పార్కులు వంటి ముఖ్యమైన సేవలను ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని కన్నబాబు పేర్కొన్నారు. వివరాలు బయట పెట్టాలి: పీపీపీ ప్రాజెక్టులకు కేటాయించిన భూములు, వాటి మార్కెట్ విలువ, ప్రైవేట్ పెట్టుబడులు, ప్రభుత్వ వాటా, పన్ను మినహాయింపులు వంటి పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. విధానం ఉపసంహరించుకోవాలి: ఈ పీపీపీ-2026 పాలసీని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేదా దీనిపై బహిరంగ చర్చ పెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కాకినాడ

ఇంటింటికీ తెలుగుదేశం’తో సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటా

కరప, ఆగస్టు 26: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కరప మండలం పెనుగుదురు గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్తిబాబు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు. గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజాభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.