kakinada_district_police కాకినాడ జిల్లాలో రాత్రి పూట అనవసరంగా తిరిగే ఆకతాయిలకు చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించిన పోలీసులు
నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు రాత్రి వేళల్లో ప్రత్యేక నిఘాను మరింత పెంచారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ రవికుమార్ గారి పర్యవేక్షణలో గత రాత్రి అనగా 05.09.2026 తేదీన కాకినాడ పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కాకినాడ ఒకటవ పట్టణ సీఐ ఎం. నాగ దుర్గారావు ఆధ్వర్యంలో షాడో టీమ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, నిబంధనలకు లోబడి లేని 20 వాహనాలను సీజ్ చేశారు. రాత్రి వేళల్లో అతిగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి వారి కౌన్సిలింగ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, కార్లలోపలపై ప్రత్యేక నిఘా ఉంచారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు.
అదేవిధంగా వాహనదారులకు రోడ్డు భద్రతా అవగాహన కల్పిస్తూ “సేఫ్ రైడ్ అండ్ డ్రైవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ కోసం రాత్రి పహరాలో వాహనాల తనిఖీలు, నాకాబందీ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తున్నామని కాకినాడ జిల్లా పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




