Sunday, 30 August 2026
  • Home  
  • స్వచ్ఛమైన కాకినాడ–పచ్చని కాకినాడే లక్ష్యం: ఎమ్మెల్యే కొండబాబు
- కాకినాడ

స్వచ్ఛమైన కాకినాడ–పచ్చని కాకినాడే లక్ష్యం: ఎమ్మెల్యే కొండబాబు

### స్వచ్ఛమైన కాకినాడ–పచ్చని కాకినాడే లక్ష్యం: ఎమ్మెల్యే కొండబాబు **కాకినాడ:** ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కాకినాడను స్వచ్ఛంగా, పచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు. స్థానిక కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆల్ ఈజ్ వెల్ సంస్థకు మొక్కల సంరక్షణ కోసం స్థలం కేటాయించిన సందర్భంగా డా. చిట్ల కిరణ్, డా. అడ్డాల సత్యనారాయణ, కిషోర్ తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో విస్తృతంగా మొక్కలు నాటడం, పార్కులను అభివృద్ధి చేయడం, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్‌జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, సైకిల్ ట్రాక్‌లు, కాలినడక మార్గాల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. కాకినాడ బీచ్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డా. అడ్డాల సత్యనారాయణ తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, నివాస సంఘాలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని డా. చిట్ల కిరణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. రాజకుమార్, టి.వి.వి.ఎస్.ఎన్. రెడ్డి, డా. రవివర్మ, విక్రమ్, రాజేంద్ర, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

### స్వచ్ఛమైన కాకినాడ–పచ్చని కాకినాడే లక్ష్యం: ఎమ్మెల్యే కొండబాబు

**కాకినాడ:** ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కాకినాడను స్వచ్ఛంగా, పచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు. స్థానిక కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆల్ ఈజ్ వెల్ సంస్థకు మొక్కల సంరక్షణ కోసం స్థలం కేటాయించిన సందర్భంగా డా. చిట్ల కిరణ్, డా. అడ్డాల సత్యనారాయణ, కిషోర్ తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో విస్తృతంగా మొక్కలు నాటడం, పార్కులను అభివృద్ధి చేయడం, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్‌జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, సైకిల్ ట్రాక్‌లు, కాలినడక మార్గాల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు.

కాకినాడ బీచ్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డా. అడ్డాల సత్యనారాయణ తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, నివాస సంఘాలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని డా. చిట్ల కిరణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. రాజకుమార్, టి.వి.వి.ఎస్.ఎన్. రెడ్డి, డా. రవివర్మ, విక్రమ్, రాజేంద్ర, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.