వరంగల్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు పిలుపు మేరకు BJYM జిల్లా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో చేపడుతున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” పోరాటానికి ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 15వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఫీజు బకాయిలు పేరుకుపోయి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. ఫలితంగా విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ విద్యార్థుల కష్టాలు మాత్రం మారడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యాన్ని కొనసాగించడం ఎందుకు?” అని రాణా ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు.
విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ చేస్తున్న పోరాటం న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఈ పోరాటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం – ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుంది!
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా,జిల్లా నాయకులు,రాష్ట్ర నాయకులు,వివిధ మోర్చాల నాయకులు,ముఖ్య నాయకులు,సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు…

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
వరంగల్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచందర్ రావు పిలుపు మేరకు BJYM జిల్లా అధ్యక్షులు ఎర్రగొల్ల భరత్ వీర్ ఆధ్వర్యంలో చేపడుతున్న “ఫీజు బకాయి – బీజేపీ లడాయి” పోరాటానికి ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 15వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఫీజు బకాయిలు పేరుకుపోయి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో కీలకమని, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు. ఫలితంగా విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ విద్యార్థుల కష్టాలు మాత్రం మారడం లేదు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్యాన్ని కొనసాగించడం ఎందుకు?” అని రాణా ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ చేస్తున్న పోరాటం న్యాయం జరిగే వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ఆయన కోరారు. ఈ పోరాటంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం – ఫీజు బకాయిల విడుదల కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుంది! ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా,జిల్లా నాయకులు,రాష్ట్ర నాయకులు,వివిధ మోర్చాల నాయకులు,ముఖ్య నాయకులు,సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు…

