నంద్యాల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విమర్శించారు. శనివారం నంద్యాలలోని తన నివాసంలో రాయలసీమ రైతాంగ సమస్యలపై రైతులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో ఆయన మాట్లాడారు.సకాలంలో సాగునీరు అందక, పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ, సాగునీటి సాధన కోసం సెప్టెంబర్ 1వ తేదీన వెలుగోడు రిజర్వాయర్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమానికి రైతులు, రైతు సంఘం నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, నంది రైతు సమైక్య అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, రైతు నాయకులు అరికట్ల శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కూటమి పాలనలో వ్యవసాయం ధ్వంసం: శిల్పా రవి