Wednesday, 30 September 2026

Tag: news

కాకినాడ

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నుండి అప్పన్నపాలెం వెళ్లే ప్రధాన రహదారి వంతెన

కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నుండి అప్పన్నపాలెం వెళ్లే ప్రధాన రహదారి వంతెన కూలి ప్రజలు రాకపోకలు లేక ఇబ్బంది గురవుతున్న ప్రజలు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా సమీప పట్టణమైన ఏలేశ్వరం రావాలి అర్ధరాత్రి అయ్యిన అపరాత్రి అయ్యిన గర్భిణీ స్త్రీలు నానా అవస్థలుపడుతున్నారు ఎన్ని సోషల్ మీడియా పోస్టులు వేస్తున్న ఎంత మంది రాజకీయ నాయకులకు సమస్య తెలియజేసిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా సమస్య లో ఎ మాత్రం మార్పు లేదు ప్రభుత్వాలు మారిన కానరాని బ్రిడ్జి మార్పులో తీరు దయచేసి ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా అక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చేజర్లలో ఎదుర్కొంటున్న ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

గత పది సంవత్సరాలుగా కొనసాగుతున్న LSS బస్సును తొలగించడంతో ఉద్యోగస్తులు మరియు వ్యాపారస్తులు విద్యార్థులు సరైన సమయానికి చేరుకోలేకపోతున్నారు. కాగా దీనితోపాటు ఇతర బస్సుల ద్వారా ప్రయాణించుటకు బస్సు రద్దీగా ఉండటంతో ఫుట్ పాత్ మీద ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చింది .ఈ బస్సు చేజర్లలో ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై నెల్లూరులో 9:45 కి చేరుకుంటుంది. కావున ఈ బస్సును మరల తిరిగి అదే సమయానికి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు

అనంతపురం

65 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రపంచంలో ఉపాధ్యాయ వృత్తిని మించిన గొప్ప వృత్తి మరొకటి లేదని అనంతపురం ఎంపీ అంబికా జి. లక్ష్మీనారాయణ అన్నారు. ఎస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మేరా యువ భారత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల డ్రామా హాల్‌లో గురుపూజోత్సవం నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి అతిథులు పుష్పాంజలి ఘటించారు. విద్యార్థులకు విద్యతోపాటు జీవితానికి సరైన మార్గాన్ని చూపే గురువుల సేవలు అమూల్యమని ఎంపీ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తమ సేవలందిస్తున్న 65 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డా. పతిక రమేష్ నారాయణ, డా. పి. పద్మశ్రీ, బిసాటి భరత్, సుంకర రమేష్, డా. గీతా బాల, డా. గజ్జల లక్ష్మణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

కుమారపురంలో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

కుమారపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కళ్యాణ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని కుమారపురంలో జనసేన నాయకులు, జనసైనికులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ అభయ బ్లడ్‌ సెంటర్‌ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కార్యకర్తలు, గ్రామ యువత ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి పవన్‌ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్‌తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువత పాల్గొన్నారు.

కాకినాడ

స్వచ్ఛమైన కాకినాడ–పచ్చని కాకినాడే లక్ష్యం: ఎమ్మెల్యే కొండబాబు

### స్వచ్ఛమైన కాకినాడ–పచ్చని కాకినాడే లక్ష్యం: ఎమ్మెల్యే కొండబాబు **కాకినాడ:** ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కాకినాడను స్వచ్ఛంగా, పచ్చగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు పిలుపునిచ్చారు. స్థానిక కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఆల్ ఈజ్ వెల్ సంస్థకు మొక్కల సంరక్షణ కోసం స్థలం కేటాయించిన సందర్భంగా డా. చిట్ల కిరణ్, డా. అడ్డాల సత్యనారాయణ, కిషోర్ తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో విస్తృతంగా మొక్కలు నాటడం, పార్కులను అభివృద్ధి చేయడం, కమ్యూనిటీ గార్డెన్లు, గ్రీన్‌జోన్లు ఏర్పాటు చేయడంతో పాటు తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేసే విధానాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, సైకిల్ ట్రాక్‌లు, కాలినడక మార్గాల ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. కాకినాడ బీచ్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డా. అడ్డాల సత్యనారాయణ తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, నివాస సంఘాలతో కలిసి కార్యక్రమాలు చేపడతామని డా. చిట్ల కిరణ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. రాజకుమార్, టి.వి.వి.ఎస్.ఎన్. రెడ్డి, డా. రవివర్మ, విక్రమ్, రాజేంద్ర, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

మోకిల ప్లాట్ల ఈ-వేలంపై ప్రీ-బిడ్ సమావేశం

HMDA ఆధ్వర్యంలో మోకిల లేఅవుట్‌లోని 35 నివాస ప్లాట్ల ఈ-వేలంపై బుధవారం ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ V.V.V.S. అప్పారావు, డిప్యూటీ కలెక్టర్ Y. సుదర్శన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ A. రవీందర్ రెడ్డి, PRO K. శ్రీకాంత్ రెడ్డి, D. శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. MSTC, KPMG ప్రతినిధులు ఈ-వేలం విధానాన్ని వివరించారు. రిజిస్ట్రేషన్‌కు ఆగస్టు 31 చివరి తేదీ కాగా, సెప్టెంబర్ 2న ఈ-వేలం జరగనుంది. HMDA హెల్ప్‌లైన్: 7416835522.

అన్నమయ్య

రాజుకుంటలో మహిళా భద్రతపై అవగాహన

చిట్వేలు: రాజుకుంట గ్రామంలో మహిళలు, బాలికల భద్రతపై చిట్వేలు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రైల్వేకోడూరు రూరల్‌ సీఐ డి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సై ఎస్‌. వినోద్‌కుమార్‌ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందే విధానం, మహిళలపై నేరాల నివారణపై అవగాహన కల్పించారు. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్‌, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దని, బ్యాంకు వివరాలు, OTPలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు.బాల్య వివాహాలను అరికట్టేందుకు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. అత్యవసర సమయంలో 112కు కాల్‌ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.