నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో రబీ-2026 సీజన్‌కు గాను 35% రాయితీపై పప్పు శనగ విత్తనాల పంపిణీని మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, టిడిపి కన్వీనర్ టి. విశ్వనాథరెడ్డి ప్రారంభించారు.
క్వింటాలు విత్తనాల అసలు ధర ₹9,000 కాగా, ప్రభుత్వం ₹3,150 రాయితీ ఇస్తోందని, రైతులు ₹5,850 చెల్లించి పొందవచ్చని ఏవో తెలిపారు. ప్రతి రైతుకూ గరిష్టంగా 5 ఎకరాలకు (10 బస్తాలు) విత్తనాలు ఇస్తారని, రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బాలలింగమయ్య, సిబ్బంది రాము నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

నంద్యాల మండలంలో 35% రాయితీతో పప్పు శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం
నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో రబీ-2026 సీజన్‌కు గాను 35% రాయితీపై పప్పు శనగ విత్తనాల పంపిణీని మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, టిడిపి కన్వీనర్ టి. విశ్వనాథరెడ్డి ప్రారంభించారు. క్వింటాలు విత్తనాల అసలు ధర ₹9,000 కాగా, ప్రభుత్వం ₹3,150 రాయితీ ఇస్తోందని, రైతులు ₹5,850 చెల్లించి పొందవచ్చని ఏవో తెలిపారు. ప్రతి రైతుకూ గరిష్టంగా 5 ఎకరాలకు (10 బస్తాలు) విత్తనాలు ఇస్తారని, రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బాలలింగమయ్య, సిబ్బంది రాము నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

