Wednesday, 30 September 2026

Tag: Farmer

నంద్యాల

నంద్యాల మండలంలో 35% రాయితీతో పప్పు శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం

నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో రబీ-2026 సీజన్‌కు గాను 35% రాయితీపై పప్పు శనగ విత్తనాల పంపిణీని మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు, టిడిపి కన్వీనర్ టి. విశ్వనాథరెడ్డి ప్రారంభించారు. క్వింటాలు విత్తనాల అసలు ధర ₹9,000 కాగా, ప్రభుత్వం ₹3,150 రాయితీ ఇస్తోందని, రైతులు ₹5,850 చెల్లించి పొందవచ్చని ఏవో తెలిపారు. ప్రతి రైతుకూ గరిష్టంగా 5 ఎకరాలకు (10 బస్తాలు) విత్తనాలు ఇస్తారని, రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి బాలలింగమయ్య, సిబ్బంది రాము నాయక్, గ్రామ రైతులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.