Wednesday, 30 September 2026
  • Home  
  • అవగాహనతోనే హెచ్‌ఐవీకి అడ్డుకట్ట: జేసీ సూరజ్ ధనంజయ్
- నంద్యాల

అవగాహనతోనే హెచ్‌ఐవీకి అడ్డుకట్ట: జేసీ సూరజ్ ధనంజయ్

హెచ్‌ఐవీపై సరైన అవగాహనతోనే దానికి అడ్డుకట్ట వేయవచ్చని నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గనోరే అన్నారు. మంగళవారం ఎయిడ్స్ నివారణ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి సర్వజన ఆసుపత్రి వరకు నిర్వహించిన 5 కిలోమీటర్ల ‘రెడ్ రన్‌’ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.ఈ రెడ్ రన్ పోటీలలో వినోద్ కుమార్, సావిత్రిబాయి ప్రథమ స్థానాల్లో నిలవగా… వీరు అక్టోబర్ 8న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని డీఎంహెచ్‌వో డాక్టర్ శారదాబాయి తెలిపారు. యువత భయం వీడి హెచ్‌ఐవీ పరీక్షలకు ముందుకు రావాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో వైద్య, క్రీడా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.