ఏన్కూరు ఎం పీ ఓ జీ వీ ఎస్ నారాయణకు ఎంపీడీవో గా పదోన్నతి
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 12
ఏన్కూరు:
ఏన్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న జీవీఎస్ నారాయణకు ఎంపీడీవోగా పదోన్నతి లభించింది. ప్రభుత్వం చేపట్టిన పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఆయనకు ఎంపీడీవోగా పదోన్నతి కల్పించినట్లు సమాచారం.ఇప్పటివరకు ఏన్కూరు మండలంలో ఎంపీఓగా విధులు నిర్వహించిన జీవీఎస్ నారాయణ పరిపాలనా వ్యవహారాల్లో తనదైన సేవలు అందించారు. పదోన్నతి అనంతరం ఖమ్మం జిల్లాలో ఏ మండలానికి ఎంపీడీవోగా నియమిస్తారనే విషయం ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆయన కొత్త పోస్టింగ్‌పై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.జీవీఎస్ నారాయణకు ఎంపీడీవోగా పదోన్నతి లభించడంపై ఏన్కూరు మండలానికి చెందిన అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.

