ఖమ్మం ఆగష్టు 13
(పున్నమి ప్రతినిధి)
దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుతూ ఖమ్మం నగరంలో నేడు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు పేవిలియన్ గ్రౌండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై జిల్లా పరిషత్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. ఈ ర్యాలీలో ప్రజలు, యువత, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేశభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హర్ ఘర్ తిరంగా రాష్ట్ర కో-కన్వీనర్ గల్లా సత్య నారాయణ, భూక్యా శ్యాం సుందర్ నాయక్, వేల్పుల సుధాకర్, అనంతు ఉపేందర్ విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండాతో నిర్వహించే ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశభక్తిని చాటాలని వారు పిలుపునిచ్చారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.

