
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష సమావేశం
మరిపెడ, సెప్టెంబర్ 28: మరిపెడ మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై వివిధ మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ గారు హాజరై ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, వివిధ మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

