అనపర్తి, జూలై 27 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి KAR జిల్లా పరిషత్ హైస్కూల్లో డాక్టర్ పోతంశెట్టి రామారెడ్డి (రాము డాక్టర్) 80వ జయంతి వేడుకలు, పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ పోతంశెట్టి రామారెడ్డి సేవలను స్మరించుకున్నారు. డాక్టర్ పోతంశెట్టి జానకిరామారెడ్డితో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రముఖ వాస్తు సిద్ధాంతి బ్రహ్మశ్రీ మిక్కిలి దుర్గయ్య శాస్త్రిని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ పోతంశెట్టి జానకిరామారెడ్డి తదితరులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు విద్యలో ఉన్నత ఫలితాలు సాధిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



