Friday, 4 September 2026
  • Home  
  • ఉదయగిరి: డయాలసిస్ కేంద్రం మంజూరు పట్ల హర్షం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: డయాలసిస్ కేంద్రం మంజూరు పట్ల హర్షం

స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (సీహెచ్సీ)కు డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తూ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడంపై వైద్యశాల కమిటీ సభ్యుడు డా. తుమ్మల భాస్కరరావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఇకపై చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుందని పేర్కొన్నారు. స్థానికంగానే వైద్య సేవలు అందడంతో రోగులకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని తెలిపారు. ఈ నిర్ణయం ఉదయగిరి ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని డా. భాస్కరరావు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.