సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.


