అనపర్తి, ఆగస్టు 22 (పున్నమి ప్రతినిధి): ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి–ఎన్జీవో బిక్కవోలు మండల శాఖ అధ్యక్షులు, రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పీఎస్వీ), అనపర్తి నియోజకవర్గ ఇంచార్జి (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ), పున్నమి ప్రతినిధి శ్రీ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు (రమేష్ నాయుడు) జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీమతి మణికుమారి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు (ఆర్టీఐ కమిటీ, పీఎస్వీ) వారి కుమార్తెల ఆధ్వర్యంలో శనివారం అనపర్తిలోని శ్రీ శ్రీ తేతలి రామిరెడ్డి–మంగయ్యమ్మ చారిటీస్ వారి మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న 25 మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం వారి ఆశీర్వచనాలు తీసుకుని, వారితో కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. జన్మదిన వేడుకలను ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పెదపాటి విష్ణు, బిక్కవోలు టీడీపీ సీనియర్ నాయకులు చోడవరపు రాంబాబు, ఆశ్రమ వ్యవస్థాపకులు తేతలి నారాయణరెడ్డి, ఆశ్రమ సిబ్బంది, సేవా సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంతో జరుపుకోవడం ద్వారా సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు కుటుంబ సభ్యులు మానవతా విలువలను చాటుకున్నారు.

