వార్త ముఖ్యాంశాలు
- దివ్య కుటుంబానికి అండగా నిలిచిన త్యాజంపూడి జనసైనికులు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన గారపాటి దివ్య అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం.
- ఈ క్లిష్ట సమయంలో దివ్య కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో త్యాజంపూడి గ్రామ జనసైనికులు ముందుకు వచ్చి రూ.31,500 ఆర్థిక సహాయం అందించారు.
- ఈ సహాయ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన త్యాజంపూడి జనసైనికులు రేవాడ సత్యనారాయణ .
దివ్య కుటుంబానికి అండగా నిలిచిన త్యాజంపూడి జనసైనికులు
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 12
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
నల్లజర్ల, దేవరపల్లి మండలం దుమంతునిగూడెం గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన గారపాటి దివ్య అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం.
ఈ క్లిష్ట సమయంలో దివ్య కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో త్యాజంపూడి గ్రామ జనసైనికులు ముందుకు వచ్చి రూ.31,500 ఆర్థిక సహాయం అందించారు.
ఈ సహాయ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన త్యాజంపూడి జనసైనికులు రేవాడ సత్యనారాయణ . కొమ్మిరెడ్డి శ్రీనివాసు టపా కుబేరుడు
టపా సత్తిబాబు సతీష్
ఈ కార్యక్రమంలో దుమంతునిగూడెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు జి.పోసి బాబు అనిసెట్టి ఆదిత్య కిరణ్ పాల్గొన్నారు.
ఒక జనసైనికురాలి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు గ్రామానికి చెందిన జనసైనికులు స్పందించి ఆర్థికంగా అండగా నిలవడం ఎంతో అభినందనీయం.
జనసేన అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు కష్టసమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచే కుటుంబం అనే విషయాన్ని త్యాజంపూడి జనసైనికులు. అండగా వున్నా అందరికి కృతజ్ఞతలు. పున్నమి రిపోర్టార్ గోపినాధ్ కొండేపూడి.