Wednesday, 26 August 2026
  • Home  
  • గురజాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో సెమిస్టర్ 83.26% ఉత్తీర్ణత…!
- అనకాపల్లి

గురజాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో సెమిస్టర్ 83.26% ఉత్తీర్ణత…!

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ఎలమంచిలి: స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2026లో నిర్వహించిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఏకంగా 83.26% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కోర్సుల వారీగా ఉత్తీర్ణత శాతం: బి.ఎ: 61.54% బీ.కాం: 72.31% బి.ఎస్సీ: 90.51% పరీక్షల నిర్వహణ అధికారి శ్రీ యం కిషోర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలను సాధించిన విద్యార్థులను అభినందించారు. టాపర్ల వివరాలు: మొదటి స్థానం: జి నాగ సృజన (కంప్యూటర్ సైన్స్ – 9.37) రెండవ స్థానం: కే లావణ్య (కంప్యూటర్ సైన్స్ – 9.35) మూడవ స్థానం: ఎం. దుర్గ (బోటనీ – 8.93) ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ వి.ఏ. సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, ఐక్య కోఆర్డినేటర్ డాక్టర్ కే. వెంకన్న, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీ టి. అప్పారావు, వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలు పాల్గొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను త్వరితగతిన విడుదల చేయడంలో సహకరించిన ఎగ్జామినేషన్ సెల్ సిబ్బంది పి. విశ్వేశ్వరరావు, కే. ధనలక్ష్మిలను ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది అభినందించారు

పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్

ఎలమంచిలి: స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2026లో నిర్వహించిన రెండవ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఈ పరీక్షల్లో ఏకంగా 83.26% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
కోర్సుల వారీగా ఉత్తీర్ణత శాతం:
బి.ఎ: 61.54%
బీ.కాం: 72.31%
బి.ఎస్సీ: 90.51%
పరీక్షల నిర్వహణ అధికారి శ్రీ యం కిషోర్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలను సాధించిన విద్యార్థులను అభినందించారు.
టాపర్ల వివరాలు:
మొదటి స్థానం: జి నాగ సృజన (కంప్యూటర్ సైన్స్ – 9.37)
రెండవ స్థానం: కే లావణ్య (కంప్యూటర్ సైన్స్ – 9.35)
మూడవ స్థానం: ఎం. దుర్గ (బోటనీ – 8.93)
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ వి.ఏ. సత్యనారాయణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు, ఐక్య కోఆర్డినేటర్ డాక్టర్ కే. వెంకన్న, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీ టి. అప్పారావు, వివిధ డిపార్ట్మెంట్ల హెచ్ఓడిలు పాల్గొన్నారు.
పరీక్షలను విజయవంతంగా నిర్వహించి ఫలితాలను త్వరితగతిన విడుదల చేయడంలో సహకరించిన ఎగ్జామినేషన్ సెల్ సిబ్బంది పి. విశ్వేశ్వరరావు, కే. ధనలక్ష్మిలను ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది అభినందించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.