పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
యలమంచిలి మండలంలో సైకిల్ పాలెం గ్రామంలో మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి సన్యాసినాయుడు అధ్యక్షతన రెండేళ్ల కూటమి పాలనపై అభివృద్ధి & సంక్షేమ కార్యక్రమాల భాగంగా నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచి, ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరియు మంత్రివర్యులు నారా లోకేష్ దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందని, సూపర్ సిక్స్ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు.
తల్లికి వందనం పథకం ద్వారా ఒక కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున అందజేస్తున్నామని, గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకాన్ని పరిమితం చేశారని విమర్శించారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర సహాయంతో కలిపి ఏడాదికి రూ.20,000 అందిస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అన్నా కాంటీన్ల పునరుద్ధరణ, యువతకు ఉద్యోగాల కల్పన వంటి హామీలను అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తంశెట్టి. రాజా, వెంకటరమణారావు, క్లస్టర్ ఇంచార్జ ఊడి రామకృష్ణ,యూనిట్ ఇంచార్జ్ రాజన.వెంకు నాయుడు,దాడి. లోకేష్,సీనియర్ నాయకులు వరహాలు,గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీను,అప్పలనాయుడు, ప్రకాష్,అప్పారావు, చిరంజీవి పాల్గొన్నారు.


