పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో బేడ బుడగ జంగం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బోనాల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. బేడ బుడగ జంగం ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
బోనాల పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యువత ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భక్తుల జైజైకారాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి పండుగలను యువత ఆధ్వర్యంలో ఐక్యంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బేడ బుడగ జంగం వివేకానంద యూత్ సభ్యులు పండుగ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం అభినందనీయమని దూపం అంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.

నాగులపల్లి గ్రామంలో బేడ బుడగ జంగం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ, దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామ 3వ వార్డు మెంబర్
పున్నమి: నాగర్ కర్నూల్ జిల్లా, కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో బేడ బుడగ జంగం వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున బోనాల పండుగ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు. బేడ బుడగ జంగం ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యువత ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భక్తుల జైజైకారాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్ దూపం అంజనేయులు మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి పండుగలను యువత ఆధ్వర్యంలో ఐక్యంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బేడ బుడగ జంగం వివేకానంద యూత్ సభ్యులు పండుగ ఏర్పాట్లలో చురుకుగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయడం అభినందనీయమని దూపం అంజనేయులు తెలిపారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు పాల్గొన్నారు.

