అశ్వాపురం: రాజకీయాలు, పార్టీలు వేరైనా రైతు సంక్షేమమే లక్ష్యంగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం ముందుకు సాగింది. అప్పటి ఎమ్మెల్యే రేగా కాంతారావు ఈ పథకానికి శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టగా, అనంతరం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన పాయం వెంకటేశ్వర్లు మిగిలిన పనులను వేగవంతం చేసి పూర్తి చేయించారు. తుమ్మలచెరువు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేలా పథకాన్ని అంకితం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకరు బీజం వేస్తే.. మరొకరు దానిని పూర్తి చేశారని, రాజకీయ భేదాలకు అతీతంగా రైతు ప్రయోజనమే ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రాజెక్టు పూర్తితో తుమ్మలచెరువు ఆయకట్టు సస్యశ్యామలం కావడంతో పాటు రైతుల చిరకాల ఆకాంక్ష నెరవేరనుంది.



