అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకలో రూ.3 కోట్లతో నిర్మించనున్న హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి శుక్రవారం భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ శంకుస్థాపన చేశారు. సుమారు 10 ఎకరాల్లో హస్తకళా హబ్, థీమ్ పార్క్ అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏటికొప్పాక లక్క బొమ్మలు, సహజ రంగుల వినియోగానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం వద్ద హస్తకళల ప్రదర్శన, రిసార్ట్, బోటు షికారు వంటి పర్యాటక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, టివియస్ ప్రకాష్, గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, హస్తకళాకారులు పాల్గొన్నారు.

రూ.3 కోట్లతో ఏటికొప్పాక హస్తకళ థీమ్ పార్క్