Sunday, 27 September 2026

Tag: పోలీస్

ఖమ్మం

సైబర్‌ మోసాలపై అప్రమత్తతే రక్షణ: టౌన్ ఏసీపీ రమణమూర్తి

సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు, యువతతో పాటు ప్రజలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో సైబర్‌ జాగృతా దివాస్‌ నిర్వహించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీ, కేవైసీ వివరాలను అపరిచితులతో పంచుకోవద్దన్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లపై క్లిక్ చేయరాదన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, ఆలస్యం చేయకుండా ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీకి అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, కరుణాకర్, బాలకృష్ణ, ఉస్మాన్ షరీఫ్, ప్రిన్సిపాల్ బానోత్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మం

ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి.. గౌరవంగా జీవించేలా సహకారం: సీపీ సునీల్ దత్

ట్రాన్స్‌జెండర్లు సమాజంలో అందరితో సమానంగా గౌరవంగా జీవించేలా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రయత్నిస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ట్రాన్స్‌జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, జీవనోపాధి అంశాలపై చర్చించారు. శుభకార్యాలు, వివాహాలు, ఇతర కార్యక్రమాలకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా వ్యవహరిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు పోలీస్ అధికారులు ముందుకు రావడం సానుకూల పరిణామమని వారు హర్షం వ్యక్తం చేశారు.

ఖమ్మం

మున్నేరు నీరు తగ్గడంతో ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలపై పోలీసుల దృష్టి

ఖమ్మంనగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేక దృష్టి సారించారు. మున్నేరు నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా అనువైన చెరువులను మంగళవారం ఆయన పరిశీలించారు. సంబంధిత పోలీస్ అధికారులు, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు చెరువును సందర్శించి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విగ్రహాల తరలింపు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో జరిగేలా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని సునీల్ దత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఎస్బీ ఏసీపీ మహేష్, ఇన్‌స్పెక్టర్లు మోహన్ బాబు, భానుప్రకాష్, సంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులు వినోద్ లాహుటి, గేంటెల విద్యాసాగర్ శ్రీహరి, ప్రసన్నకృష్ణ, వేల్పుల సుధాకర్, యుగేందర్ శర్మ, సురేష్శ ర్మ పాల్గొన్నారు.

ఖమ్మం

హెల్మెట్‌.. నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి తల్లాడలో పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై వెంకటకృష్ణ

తల్లాడ / ఖమ్మం హెల్మెట్‌, సరైన నంబర్‌ ప్లేట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు. మంగళవారం తల్లాడలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైన్‌ స్నాచింగ్‌ వంటి నేరాలకు పాల్పడి తప్పించుకునే అవకాశం ఉన్నందున పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆదేశాల మేరకు, వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. సరైన నంబర్‌ ప్లేట్‌ తెచ్చి అమర్చుకున్న వాహనదారులకు వెసులుబాటు కల్పించారు. మైనర్‌ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి వాహనానికి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్‌ ధరించి, పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఎస్సై వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం

అత్యుత్తమ సేవలకు పోలీస్ అధికారులకు ప్రతిభ పురస్కారాలు 15 మంది పోలీస్ సిబ్బందికి సేవా పతకాలు అందజేసిన సీపీ సునీల్ దత్

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2026 రాష్ట్ర పోలీసు సేవా పతకాలలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించిన 15 మంది పోలీస్ సిబ్బందికి పతకాలు లభించాయి. ఈ సందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పతకాలు అందజేసి అధికారులను అభినందించారు. ఉత్తమ సేవ పతకాలు అందుకున్న వారిలో అడిషనల్ డీసీపీ బి. రామానుజం, ARHC వి. బిక్షపతి, HC కె. సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. వీరితో పాటు సేవా పతకాలు సాధించిన **కె. నాగేంద్రరావు (ఎస్‌ఐ), ఎన్. రామిరెడ్డి (ASI), బి. సుందర్ రావు (ASI), Md. హలీమ్ (ARSI), జి. భాస్కర్ రావు (ARSI), ఎం. వెంకటేశ్వర్లు (HC), టి. హరిచరణ్ సింగ్ (HC), Sk. మదార్ సాహెబ్ (HC), ఐ. ప్రభాకరరావు (HC), Ch. రామారావు (HC), జె. కృష్ణ (PC), డి. సుశీల్ కుమార్ (PC)లను సీపీ సునీల్ దత్ అభినందించారు పోలీస్ శాఖలో నిబద్ధతతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించినందుకు ఈ పతకాలు దక్కాయని సీపీ సునీల్ దత్ పేర్కొన్నారు. అవార్డులు అందుకున్న అధికారులు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత అంకితభావంతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

మణుగూరు గ్యాంగ్‌వార్ హత్య కేసు ఛేదన.. 23 మంది అరెస్ట్

మణుగూరు / ఖమ్మం మణుగూరు: పట్టణంలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మణుగూరు నేతాజీ గ్రౌండ్‌లో ఈ నెల 27న జరిగిన శివ హత్య కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించినట్లు మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి వెల్లడించారు. వీరిలో ఇప్పటివరకు 23 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం ఖమ్మం సబ్‌జైలుకు తరలించినట్లు తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మృతుడు శివకు, ఎం.కే గ్యాంగ్ గ్రూప్ సభ్యులకు మధ్య జరిగిన వ్యక్తిగత గొడవలే హత్యకు ప్రధాన కారణమని డీఎస్పీ తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా మణుగూరుకు వచ్చిన శివను మాట్లాడుకుందామని నేతాజీ గ్రౌండ్‌కు పిలిపించి, అక్కడ విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులంతా మణుగూరుకు చెందినవారేనని, కేవలం పార్టీల పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు. నిందితులు గంజాయి వంటి మాదకద్రవ్యాలు సేవిస్తున్నట్లు విచారణలో ఎలాంటి ఆధారాలు లభించలేదని డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఖమ్మం

సేవలకు సెల్యూట్.. రిటైర్డ్ పోలీసులకు సన్మానంచేసిన సీపీ సునీల్ దత్

పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, హోంగార్డ్ సిబ్బందిని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన అధికారులకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సుదీర్ఘకాలం విధులు నిర్వహిస్తూ ప్రజలకు, శాఖకు ఎనలేని సేవలు అందించినందుకు ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందిని అభినందించారు. విధి నిర్వహణలో వారికి అండగా నిలిచిన కుటుంబ సభ్యుల సేవలను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ పొందిన వారిలో వి. సుధాకర్ రెడ్డి (SI), కె. రాయప్ప (SI), వి. రామరావు (SI), ఎం. శ్రీనివాసరావు (ASI), MD. అబ్దుల్ రహెమాన్ (ASI), SK. అహ్మద్ (HC), కె. సత్యం (HC), బి. సుందర్ రావు (ARSI), R. వెంకటేశ్వర్లు (హోంగార్డ్) ఉన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఆర్‌ఐలు కామరాజు, సురేష్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు హేమనాధ్, హోంగార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు బంక శ్రీను, జాతీయ ఉపాధ్యక్షులు E. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఖమ్మం

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి: సి ఐ భాను ప్రకాష్

ఖానాపూరం హవేలి /ఖమ్మం మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఖానాపురం హవెలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ సూచించారు. పాండురంగపురం, బల్లేపల్లి గ్రామాల్లోని పలు పాఠశాలల్లో ఖానాపురం హవెలి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు, పాఠశాల సిబ్బందికి మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు అలవాటు పడటం వల్ల ఆరోగ్యంతో పాటు సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన, మాదక ద్రవ్యాల రహిత వాతావరణాన్ని కల్పించడంతో పాటు సమాజంలో డ్రగ్స్‌పై అప్రమత్తత పెంచడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో పాఠశాల పరిసరాలు, సమీపంలోని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల ఆనవాళ్ల కోసం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.

ఖమ్మం

నీట్‌ పీజీ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 163

ఆదివారం జరగనున్న నీట్‌ పీజీ–2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ అమల్లో ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడరాదని సూచించారు. సభలు, ర్యాలీలు, వాహనాలు, డీజేలు, ధర్నాలకు అనుమతి లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్‌ బందోబస్తు, పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఖమ్మం

పెండింగ్ కేసులపై స్పీడ్ పెంచండి: సీపీ సునీల్ దత్

ముదిగొండ /ఖమ్మం ముదిగొండ పోలీస్ స్టేషన్‌ను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిని ఆయన పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సెక్టర్ అధికారులు, పోలీస్ సిబ్బందితో సీపీ మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, సీఐ మురళి, ఎస్‌ఐ నరేష్ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.