Tuesday, 1 September 2026
  • Home  
  • హెల్మెట్‌.. నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి తల్లాడలో పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై వెంకటకృష్ణ
- ఖమ్మం

హెల్మెట్‌.. నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి తల్లాడలో పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్సై వెంకటకృష్ణ

తల్లాడ / ఖమ్మం హెల్మెట్‌, సరైన నంబర్‌ ప్లేట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు. మంగళవారం తల్లాడలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైన్‌ స్నాచింగ్‌ వంటి నేరాలకు పాల్పడి తప్పించుకునే అవకాశం ఉన్నందున పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆదేశాల మేరకు, వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. సరైన నంబర్‌ ప్లేట్‌ తెచ్చి అమర్చుకున్న వాహనదారులకు వెసులుబాటు కల్పించారు. మైనర్‌ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి వాహనానికి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్‌ ధరించి, పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఎస్సై వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు.

తల్లాడ / ఖమ్మం

హెల్మెట్‌, సరైన నంబర్‌ ప్లేట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ హెచ్చరించారు. మంగళవారం తల్లాడలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చైన్‌ స్నాచింగ్‌ వంటి నేరాలకు పాల్పడి తప్పించుకునే అవకాశం ఉన్నందున పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ ఆదేశాల మేరకు, వైరా ఏసీపీ సారంగపాణి పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ లేని వాహనదారులకు జరిమానాలు విధించడంతో పాటు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించారు. సరైన నంబర్‌ ప్లేట్‌ తెచ్చి అమర్చుకున్న వాహనదారులకు వెసులుబాటు కల్పించారు. మైనర్‌ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని, ప్రతి వాహనానికి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. వాహనదారులు హెల్మెట్‌ ధరించి, పెండింగ్‌ చలాన్లు చెల్లించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని ఎస్సై వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.