Sunday, 27 September 2026

Tag: పోలీస్

ఖమ్మం

50 ఏళ్ళ తరువాత గణనాధుల వీడ్కోలు వేదిక మార్పు..

ఖమ్మం జిల్లాలో నదులు, వాగుల్లో నీటి లభ్యత లేకపోవడంతో ఈసారి గణేష్ నిమజ్జనాలకు అధికారులు చెరువులను సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం మున్నేరు నదిలో నిమజ్జనానికి తరలివెళ్లే గణనాథులకు గాంధీచౌక్‌లో స్థంబాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలకడం గత 50 ఏళ్లుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే ఈసారి దంసలపురం చెరువులో నిమజ్జనం చేయనున్న నేపథ్యంలో తొలిసారిగా గాముస్తఫానగర్‌లో ప్రత్యేక వీడ్కోలు వేదికను ఏర్పాటు చేశారు. గణేష్ ఉత్సవ కమిటీలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీడ్కోలు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉత్సవ సమితి సభ్యులు పాల్గొననున్నారు.

ఖమ్మం

చింతకానిలో 17 మంది మహిళలపై కేసు నమోదు

చింతకాని / ఖమ్మం ఖమ్మం జిల్లా చింతకాని మండలం చింతకాని గ్రామానికి చెందిన 17 మంది ఎస్సీ మహిళలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూముల్లో నారాపోగు వెంకట్రావమ్మ వరి నాట్లు వేయగా, గ్రామానికి చెందిన మహిళలు వాటిని ధ్వంసం చేశారని ఫిర్యాదు అందినట్లు చెప్పారు. వరి నాట్లను అడ్డుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మహిళలు బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. పొలంలో వరి పంటను ధ్వంసం చేయడంతో సుమారు రూ.95 వేల నష్టం వాటిల్లిందని వెంకట్రావమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వివరించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పున్నమి న్యూస్‌కు తెలిపారు.

ఖమ్మం

నిజామాబాద్‌లో ఖమ్మం జిల్లా కి చెందిన ఏఆర్ ఎస్సై సతీష్ మృతి..

ఖమ్మం / నిజామాబాద్ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం శాంతినగర్‌కు చెందిన ఏఆర్ ఎస్సై సతీష్ మృతి చెందారు. 2009లో ఏఆర్ విభాగంలో నియమితులైన ఆయన ప్రస్తుతం నిజామాబాద్‌లో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. సతీష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, అధికారుల ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతికి అసలు కారణాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఖమ్మం

రూ.14 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హాస్టల్ వార్డెన్

చర్ల / ఖమ్మం ఎస్టీ హాస్టల్‌లో కుక్‌గా పనిచేస్తున్న ఉద్యోగి జీతం చేయడానికి రూ.14 వేలు లంచం డిమాండ్ చేసిన వార్డెన్ భూక్యా వాల్ సింహ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి నిర్వహించారు. సత్యనారాయణపురం ఐటీడీఏ ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో శుక్రవారం లంచం తీసుకుంటుండగా వార్డెన్‌ను అధికారులు పట్టుకున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఏసీబీకి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఖమ్మం

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో 7 కేజీల గంజాయి స్వాధీనం

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్లాట్‌ఫారం నంబర్‌ 1 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశాకు చెందిన గజేంద్ర నాయక్‌ను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడినట్లు ఆర్‌పీఎఫ్‌ సీఐ సురేష్ గౌడ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.55 లక్షలు ఉంటుందని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ సలాం, సిబ్బంది గురవయ్య, మహేష్ పాల్గొన్నారు. రైల్వే స్టేషన్‌లో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

ఖమ్మం

వ్యభిచార ముఠా నిర్వాహకుడిపై పీడీ యాక్ట్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వ్యభిచారంలోకి దింపుతూ ఆర్థిక లాభాలు పొందుతున్న బత్తుల బాలకృష్ణ (30)పై పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన బాలకృష్ణపై ఖమ్మం టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో అనైతిక రవాణా, వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2026 జనవరి 6న విశ్వసనీయ సమాచారంతో ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. కాకినాడకు చెందిన మహిళను ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఖమ్మంకు తీసుకొచ్చి వ్యభిచారంలోకి దించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రధాన నిందితుడు బాలకృష్ణ, మెరెడ్డి సత్యవతి, లాడ్జి మేనేజర్ అలకుంట్ల శ్రీకాంత్‌తో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. నేరప్రవర్తనను అడ్డుకునేందుకు పీడీ యాక్ట్ సెక్షన్ 3(2) కింద ఉత్తర్వులు జారీ చేసి బాలకృష్ణను చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.

ఖమ్మం

మట్టి గణపతితో పర్యావరణహిత వినాయక చవితి: సీపీ సునీల్ దత్

వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యతనిస్తూ మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించాలని కోరారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఖమ్మం

లోక్ అదాలత్‌కు విశేష స్పందన.. 10,995 కేసుల పరిష్కారం

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. రాజీకి అవకాశం ఉన్న మొత్తం 10,995 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు వెల్లడించారు. వీటిలో 985 ఎఫ్‌ఐఆర్ కేసులు, 3,301 ఈ-పెట్టి కేసులు, 6,621 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 48 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకోవడంతో పాటు బాధితులకు న్యాయం అందేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పరిష్కరించిన కేసుల్లో బాధితులకు మొత్తం రూ.27,90,612 నగదు రిఫండ్ చేసినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ప్రజలు రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

ఖమ్మం

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి శాంతి కమిటీలతో సమన్వయ సమావేశంలో సీపీ సునీల్ దత్

సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శాంతి కమిటీలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శోభాయాత్ర, నిమజ్జనం సమయంలో నిర్ణయించిన మార్గాలు, సమయాలను తప్పనిసరిగా పాటించాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు. పోలీసు, నగరపాలక, అగ్నిమాపక, నీటిపారుదల, వైద్య, విద్యుత్, రవాణా శాఖల సమన్వయంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో గేంటెల విద్యాసాగర్, జయపాల్ రెడ్డి లాహోటి, రుద్ర ప్రదీప్, అల్లిక అంజయ్య, ఇన్స్పెక్టర్లు మోహన్ బాబు, బాలకృష్ణ, భానుప్రకాష్ పాల్గొన్నారు.

ఖమ్మం

ప్రశాంత గణేష్ ఉత్సవాలే లక్ష్యం.. పోలీసులకు సహకరించాలి: ఏసీపీ వసుంధర యాదవ్

సత్తుపల్లి / ఖమ్మం గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ సూచించారు. సత్తుపల్లిలోని ఏసీపీ కార్యాలయంలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల అవగాహన పోస్టర్లు, పాయింట్ బుక్స్‌ను నిర్వాహకులకు అందజేశారు. మండపాల వివరాలను పోలీసు శాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వైరింగ్‌ను నిపుణులతో తనిఖీ చేయించాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. రద్దీ, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేసుకోవాలని, డీజేలు, సౌండ్ సిస్టమ్‌ల విషయంలో నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ఊరేగింపు, నిమజ్జనం సమయంలో పోలీసులతో సమన్వయం చేసుకోవాలని, చిన్నారులు, ఈత రాని వారు నీటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ వసుంధర యాదవ్ కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.