చర్ల / ఖమ్మం
ఎస్టీ హాస్టల్లో కుక్‌గా పనిచేస్తున్న ఉద్యోగి జీతం చేయడానికి రూ.14 వేలు లంచం డిమాండ్ చేసిన వార్డెన్ భూక్యా వాల్ సింహ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కుక్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, డీఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో అధికారులు దాడి నిర్వహించారు. సత్యనారాయణపురం ఐటీడీఏ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో శుక్రవారం లంచం తీసుకుంటుండగా వార్డెన్‌ను అధికారులు పట్టుకున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఏసీబీకి ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులు తెలిపారు.



