దుత్తలూరు: ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని బైరవరం వైసీపీ మాజీ సర్పంచ్ గోనుపర్తి రమణమ్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. దుత్తలూరులో నిర్వహించిన వైసీపీ మండల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన మేకపాటి రాజగోపాల్‌రెడ్డికి ఆమె శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తామని రమణమ్మ తెలిపారు. అనంతరం మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆమెను అభినందించారు.

మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని సన్మానించిన బైరవరం మాజీ సర్పంచ్ రమణమ్మ